శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా: రేవతి భర్త భాస్కర్

శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా: రేవతి భర్త భాస్కర్

సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని... ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నాడని, కళ్ళు తెరచి చూస్తున్నాడని అన్నారు. తమ వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం ఇష్టం లేదని.. అల్లు అర్జున్ పై పెట్టిన కేసు వాపసు తీసుకుంటానని అన్నారు భాస్కర్. ప్రభుత్వం నుండి కోమటిరెడ్డి హామీ ఇచ్చారని.. అల్లు అర్జున్ రూ. 25లక్షలు ప్రకటించారని.. ఇప్పటికి రూ. 10లక్షలు ఇచ్చారని అన్నారు భాస్కర్. మైత్రి మూవీస్ వారు రూ. 50లక్షలు ఇచ్చారని.. సుకుమార్ ఫ్యామిలీ కూడా అండగా ఉందని అన్నారు భాస్కర్.ఇదిలా ఉండగా.. హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన నిర్మాత దిల్ రాజు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.

 ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఇక రేవతి కుటుంబానికి అండగా నిలిచి ఆదుకుంటామని అన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల TFDC కు చైర్మన్ గా నియమించే సమయంలో ఇండస్ట్రీ కు ప్రభుత్వం కు బ్రిడ్జి గా పని చెయ్యాలని చెప్పారు. అలాగే శ్రీతేజ తండ్రి భాస్కర్ కి ఇండస్ట్రీ లో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సిఎం కు చెప్తే..సిఎం మంచి నిర్ణయం అని చెప్పారని అన్నారు.

Also Read :- సంధ్య థియేటర్ FIRలో పుష్ప నిర్మాతలు

సంధ్య థియేటర్ ఘటన రిమాండ్ రిపోర్టులో  నిందితుల లిస్ట్ ను   పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో  అల్లు అర్జున్ ను  ఏ11 గా చేర్చిన పోలీసులు.. ఏ 18గా పుష్ఫ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతను చేర్చారు. ఏ1 నుంచి   ఏ8 వరకు థియేటర్ యజమానులు, మేనజర్ ను చేర్చారు. ఏ9 ,ఏ 10 గా  సంధ్య థియేటర్  సెక్యూరిటీ, మేనేజర్ ను చేర్చారు. ఏ 11 నుంచి ఏ 17 వరకు అల్లు అర్జున్, బౌన్సర్, సెక్యూరిటీ పేర్లను చేర్చారు. ఏ 18గా మైత్రీమూవీస్ ను చేర్చారు.