సత్తుపల్లి, వెలుగు : పదిహేనేండ్లుగా ఎమ్మెల్యేగా కాదు.. ప్రజలకు సేవకుడిగా పని చేశానని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పదవులు అనుభవించి నేడు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారన్నారు. మంగళవారం సత్తుపల్లి మండల పరిధిలోని తాళ్లమడ, బేతుపల్లి, గంగారం, ప్రకాశ్ నగర్ కాలనీ, మేడిశెట్టివారిపాలెం, మేడిశెట్టి వారి పాలెం, పాకల గూడెం, కిష్టాపురం, తుమ్మూరు, నారాయణపురం, సదాశివపేట గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన సండ్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీఆర్ఎస్లో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారన్నారు.
ALSO READ : గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్
తాను చివరిదాక కార్యకర్తలకు అండగా నిలుస్తూ కాపాడుకున్నానన్నారు. గడిచిన ఐదేండ్లలో రూ.1000 కోట్లతో సత్తుపల్లిని డెవలప్ చేశానని తెలిపారు. చేసిన పలు అభివృద్ధి పనులను వివరించారు. మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ హైమావతి, కూసంపుడి రామారావు, సర్పంచులు మందలపు నాగమణి, మందపాటి వాసురెడ్డి, భేతి వెంకట శ్రీను, దుగ్గిరాల వాణి, మోదుగు నీలిమ, తుంబురు సరస్వతి, తుంబురు కృష్ణారెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మోరంపూడి ప్రభాకర్, మందలపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.