పెనుబల్లి, వెలుగు : తెలంగాణలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ది సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టేకులపల్లి నుంచి పెనుబల్లి వరకు ఎంపీ బండి పార్థసారధిరెడ్డి తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వియం బంజర్ రింగ్ సెంటర్లో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకోలేదని, అప్పులభాదలతో ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులకు పెట్టుబడితో వ్యవసాయానికి 10వేలు, ప్రమాదవపుశాత్తు చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. ఐదులక్షల బీమా ఇచ్చి ఆదుకున్నామని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక భూమిలేని వారికి కేసీఆర్ బీమా కింద రూ. ఐదులక్షలు ఇస్తామన్నారు. 15ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలిచారని మరోసారి ఆశీర్వదించి, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు, మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, నీలాద్రి చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.