సత్తుపల్లి, వెలుగు : తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ, గౌరమ్మపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వార్డు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలే కానీ తెలంగాణ ఆడబిడ్డల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం సరికాదన్నారు.
లిక్కర్‌తో పోల్చినందుకు వెంటనే తెలంగాణ ఆడపడుచులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని జాతీయస్థాయి స్థాయిలో చేసి చూపిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతోందని, మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, నియోజకవర్గం రాజకీయ సమన్వయకర్త నరసింహారెడ్డి. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, కౌన్సిలర్లు పట్టా ప్రసాదు మేకల భవాని, గుండ్ర రఘు, రహిమున్నీసా బేగం పాల్గొన్నారు.