పెనుబల్లి , వెలుగు: దళితబంధు పథకానికి ఎలక్షన్ కోడ్ అడ్డుకాదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో కల్యాణలక్ష్మి చెక్కులు, గృహలక్ష్మి పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేశానన్నారు.
దళితబంధుపై కొంతమంది అసత్యప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినందున ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అలేఖ్య, జడ్పీటీసీ మోహనరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు , నీలాద్రి చైర్మన్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఒ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.