వరంగల్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ గా టీఆర్ఎస్ నేత సంగమ్రెడ్డి సుందర్ రాజ్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ లోని కుడా భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో సుందర్ రాజ్ పదవీ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా... సుందర్ రాజ్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కుడా పరిధిలోని గ్రామాల, చిన్న చిన్న ఆవాసాల అభివృద్ధికి మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సుందర్ రాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..