
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్ సంగమేశ్వర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ విజయానికి కృషి చేస్తానన్నారు. పీఎం మోదీ హయాంలో దేశం అత్యంత శక్తివంతంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ క్యాండిడేట్ బీబీపాటిల్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి రవికుమార్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.