
నారాయణ్ ఖేడ్, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని బీజేపీ నారాయణఖేడ్ అభ్యర్థి సంగప్ప అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేట బీజేపీ ఆఫీస్ లో అధ్యక్షుడు కోణం విట్టల్ తో కలిసి మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం నినాదంతో బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడంలేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పై ఎంతో ఆగ్రహంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.
స్థానిక ఖేడ్ ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతికి మారుపేరని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోణం విట్టల్, నాయకులు రామకృష్ణ, పట్నం మాణిక్యం, సర్పంచులు సుధాకర్, సాయిలు, శ్రావణ్, మంగళ కృష్ణ, సంగమేశ్వర్, బాబు నాయక్, సురేశ్, సుభాష్ పాల్గొన్నారు.