
పంజాగుట్ట, వెలుగు: భర్తతో గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) ఆచూకీ లభించింది. తన భార్య రూ.3.2 కోట్లు తీసుకొని, వెళ్లిపోయిందని ఆమె భర్త పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె సంగారెడ్డిలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్న అరవింద్కిరణ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి అల్వాల్నుంచి ఆ ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. మహిళా ఏపీపీకి నోటీసులిచ్చామని, నగదు మాయం కేసులో అరవింద్ కిరణ్‌ను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపారు.