నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

 సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో నిమ్జ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి  ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లోని తన చాంబర్​లో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి, తహసీల్దార్​తో సమీక్ష నిర్వహించారు.

నిమ్జ్ తో ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. భూములు ఇచ్చేవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.