
- సందడిగా రెండో రోజు టెక్నో- కల్చరల్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలని గీతం డీమ్డ్యూనివర్సిటీ ఆన్యువల్ ఫెస్ట్ ప్రమాణలో ఆటమ్ ఎలక్ర్టిక్ బైక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెక్నో-కల్చరల్ఫెస్ట్లో రెండో రోజు శుక్రవారం స్టూడెంట్స్ఆటమ్ఎలక్ర్టిక్ బైకులతో సందడి చేశారు. ఆటో షోలో భాగంగా బైకులను నడుపుతూ పలు విన్యాసాలు చేశారు. విశాక ఇండస్ర్టీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీకృష్ణ ఎలక్ర్టిక్ వాహనాలపై ఉన్న ఆసక్తితో ఆటమ్ బైక్రూపొందించారు. దీనిపై ఆరు పేటెంట్లు పొందారు.
పెట్రోల్‌తో నడిచే స్పోర్ట్స్ బైక్‌లతో సమానంగా ఆటమ్ అన్ని ఫార్మాట్లలో సూపర్ ఫర్ఫామెన్స్ ఇచ్చిందని బైక్ నడిపిన స్టూడెంట్స్ తెలిపారు. అన్ని వర్గాల యువతకు అందుబాటు రేటులో, తక్కువ చార్జ్‌తో ఎక్కువ రేంజ్ వచ్చేలా బైక్ తయారు చేయడం గొప్పవిషయమని కొనియాడారు. ప్రమాణ ఉత్సవాల్లో భాగంగా ఎంటప్రెన్యూర్ వర్క్‌షాప్, ఆర్కిటెక్చర్ మోడళ్ల ర్యాంప్‌వాక్, రా అండ్ రియల్ డాన్స్‌లు, రోబో సాకర్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
కల్చరల్ఆక్టివిటీలో సినీ గాయకులు రామ్ మిరియాల, సాహితీ చాగంటి సందడి చేశారు. చివరి రోజైన ఆదివారం భారత్‌లోనే పేరొందిన ప్రముఖ డీజే ప్రాజెక్ట్ 91, స్కాట్లాండ్ నుంచి వస్తున్న నినా సుర్టా సంగీత హోరుతో ప్రమాణ ఫెస్ట్ ముగిస్తుందని గీతం ప్రతినిధులు తెలిపారు.