లోన్ యాప్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్.. లోన్ యాప్ లో రూ.30 వేలు రుణం తీసుకున్నాడు. 30 వేలకు గానూ.. 4 నెలల్లో లక్షా 30 వేలు చెల్లించాడు. అదనంగా మరో 80 వేలు చెల్లించాలంటూ శ్రీకాంత్ ను ఒత్తిడి చేశారు లోన్ యాప్ సిబ్బంది. శ్రీకాంత్ డబ్బులు కట్టకపోవడంతో .. ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ్డారు.
దాంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్చి 30న సూసైడ్ అటెంప్ట్ చేయగా.. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న(ఏప్రిల్ 4) కన్నుమూశాడు. శ్రీకాంత్ సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోన్నాడు.