సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ టిప్పర్ కారును ఢికొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారు జోగిపేట గ్రామస్తులు వాజిద్ (28), హాజీ (28), బుక్రాన్ (29)గా గుర్తించారు పోలీసులు. 

ALSO READ : బీఆర్​ఎస్​ లీడర్లంతా కాంగ్రెస్​లోకి వస్తారు : సామేలు