
సంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి ఫుడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. పటాన్ చెరు నోవోపాన్ X రోడ్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న హైవే స్పైసి ఫుడ్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా చెలరేగిన మంటలతో ఫుడ్ సెంటర్ మొత్తం కాలి బూడిదయ్యింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.