
- ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఫైర్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌పార్టీ పైనే నర్సాపూర్ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపణలు చేయడం అర్ధరహితమని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి మండిపడ్డారు. బుధవారం పటాన్చెరు కాంగ్రెస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగిన సునీతా లక్ష్మారెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు.
ఇటీవల పటాన్చెరులో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవాలకు హాజరైన ఆమె కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేసిందని వాఖ్యానించడం సరి కాదన్నారు. కాంగ్రెస్ వల్లే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా సునీతాకు అవకాశం దక్కిందని గుర్తు చేశారు. పార్టీ మారినంత మాత్రానా కాంగ్రెస్‌పై లేని పోని ఆరోపణలు చేయడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ సునీతకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, మహిళా కమిషన్ చైర్మన్ పదవి కోసం ప్యారానగర్ డంప్ యార్డును ఎరగా వేశారని ఆరోపించారు. పాత రోజలు మరిచి కాంగ్రెస్‌పై మరోసారి నోరు పారేసుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్టౌన్వైస్ ప్రెసిడెంట్ యువరాజ్, సాయిలు, అక్షిత్, శ్రీనివాస్‌పాల్గొన్నారు.