సంగారెడ్డి జిల్లా వట్ పల్లి పీఎస్ ఎస్సై లక్ష్మణ్ పై వేటు పడింది. వట్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రమేశ్ బర్త్ డే సందర్బంగా ఎస్సై లక్ష్మన్, కానిస్టేబుల్స్ అతనితో కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల బర్త్ డేలు పీఎస్ లో చేయడమేంటని ప్రశ్నించారు.
Also Read :- స్పీకర్ ఆఫీస్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీస్ శాఖ..ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి ఎస్సై లక్ష్మన్ ను మల్టిజోన్ -II. ఐ జిపి కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇవాళ వట్ పల్లి ఎస్సైని సంగారెడ్డి విఆర్ కు పంపారు హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ.