
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. మార్కెట్ ఏరియాలోని ఐదు షాపుల్లో ఒకేసారి దొంగతనం చేశారు. షెట్టర్లు పగలగొట్టి షాపుల్లో ఉన్న నగదు, విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు.
ఈ సమాచారాన్ని షాపుల నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.