
జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాగిన మైకంలో ఓ కొడుకు తన తండ్రిని చంపాడు. జహీరాబాద్ రూరల్ ఎస్సైప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శానిటరీ కార్మికుడిగా పనిచేస్తున్న కృష్ణ (56)ను అతడి కొడుకు శివ కుమార్ తాగుడుకు బానిస కావడంతో ప్రతీరోజు పైసలు ఇవ్వాలని వేధించేవాడు. సోమవారం లిక్కర్ కోసం తండ్రిని పైసలు అడగగా ఇవ్వలేదు. కోపంతో ఫుల్లుగా తాగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన శివకుమార్ తండ్రిని కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.