భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ వాణినగర్ లో కత్తిపోట్లు కలకలం రేపాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. సుజాత అనే మహిళ స్పాట్ లోనే చనిపోయింది. భార్య కాపురానికి రావట్లేదని.. భార్య సునీత, వదిన సుజాత, ఆమె కొడుకు సాయి.. ముగ్గురిపై దాడి చేశాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. భర్తతో గొడవల కారణంగా వేరుగా ఉంటుంది సునీత. ఉదయం అక్కతో కలిసి డ్యూటీకి వెళ్తున్న సునీతకు అడ్డుపడ్డాడు శ్రీనివాస్. ఈ సమయంలో సునీత, శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు జోక్యం చేసుకున్న సుజాతపై దాడి చేశాడు శ్రీనివాస్. ఆ తర్వాత సునీత, సాయిపై కత్తితో అటాక్ చేశాడు. దాడిలో సుజాత స్పాట్ లోనే చనిపోగా.. సునీత, సాయిలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

నిందితుడి భార్య  స్థానికంగా ఉన్న అరబిందో కంపెనీలో పనిచేస్తోంది. గత కొంతకాలంగా సునీత వాణినగర్ లోని తన అక్క ఇంటి వద్దనే ఉంటోంది. హత్య జరిగిన స్థలాన్ని పటాన్‌చెరు DSP భీంరెడ్డి పరిశీలించారు. హత్యకు కుటుంబ కలహలే కారణమని చెప్పారు. నిందుతుని కోసం గాలిస్తున్నామని త్వరలోనే శ్రీనివాస్‌ని పట్టుకుంటామని చెప్పారు.