
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
రామచంద్రాపురం, వెలుగు : తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి సభను సక్సెస్ చేసి తీరుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. గురువారం రామచంద్రాపురం పార్టీ కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి, విజయభేరి సభపై ఆయన దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం విమోజన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజయభేరి సభకు సహాయంగా తెల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరుణ్ రూ.లక్ష చెక్కును జగ్గారెడ్డికి అందజేశారు. నాయకులు శ్యామ్ గౌడ్, సపాన్‌దేవ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మవీన్ గౌడ్ పాల్గొన్నారు.