
కంది, వెలుగు: సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మిపై వైస్ చైర్పర్సన్ లతా విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. నెల రోజుల క్రితం మున్సిపల్ చైర్ పర్సన్ పై వైస్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు అవిశ్వాస నోటీసు అందజేశారు. గురువారం ఆర్డీవో వసంత కుమారి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మెజారిటీ కౌన్సిల్ మెంబర్స్హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం కొందరు కౌన్సిల్ మెంబర్స్ మున్సిపల్ ఆఫీస్ బయట మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చే సమయంలో 24 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు కానీ తీర్మానం ప్రవేశపెట్టే రోజు కొంతమంది చైర్ పర్సన్ ఇచ్చే ప్రలోభాలకు లొంగి సమావేశానికి రాకపోవడం శోచనీయమన్నారు.