
దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుడిని సంగారెడ్డి జిల్లా సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా 277 కేసులు, తెలంగాణలో 84 కేసుల్లో నిందితుడిగా ఉన్న బెంగళూరుకు చెందిన జితేందర్ సింగ్ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. 60 మొబైల్స్, 63 సిమ్స్, 13 బ్యాంక్ అకౌంట్ లని కేటుగాడు వినియోగించాడని తెలిపారు.
జాబ్స్, లోన్స్, ఆన్ లైన్ గేమ్స్ పేరిట జితేందర్ సింగ్ సైబర్ మోసాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. పీటీ వారెంట్ పై జితేందర్ సింగ్ ని అరెస్ట్ చేసి.. సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు పోలీసులు.