- సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి
మునిపల్లి, వెలుగు : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని లింగంపల్లి, కంకోల్ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లింగంపల్లి గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లను కూల్చి వేయించారు.
అనంతరం కంకల్ గ్రామ శివారులో గల వోక్సాన్ యూనివర్సిటీలోని 234, 236 గల సర్వే నంబర్లో ఉన్న 8ఎకరాల 05 ఐదు గుంటల సీలింగ్ భూమిని పరిశీలించారు. అంతకు ముందు మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి.. ఎన్ని ఎకరాలు ఉన్నాయి..
ఎక్కడైనా ఆక్రమణకు గురయ్యాయా లేదా అనే వివరాలను ఎమ్మార్వోను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్తెన్ మొళి, డిప్యూటీ ఎమ్మార్వో కృపానందం, సర్వేయర్వెంకటేశ్వర్లు, ఆర్ఐ రవీందర్, మాజీ జడ్పీటీసీ అసద్పటేల్, కాంగ్రెస్మండల అధ్యక్షుడు సతీశ్ ఉన్నారు.