
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలింగ్, మెడికల్, లీగల్ సపోర్టు, వీడియో కాన్ఫరెన్స్ రూములు, రికార్డులను పరిశీలించారు. కౌన్సిలింగ్, భరోసా సిబ్బంది నిర్వహించిన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ కేసుల్లో బాధితులను హక్కున చేర్చుకొని వారిలో ధైర్యాన్ని నింపాలని అన్నారు.
మహిళల సంబంధిత నేరాల గురించి స్కూల్స్ కాలేజీలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ తదితర ఉమెన్ సేఫ్టీ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి, భరోసా సిబ్బంది తదితరులున్నారు.