పోలీస్ అవుట్ పోస్టును చెక్ చేసిన : ఎస్పీ రూపేశ్

పోలీస్ అవుట్ పోస్టును చెక్ చేసిన  : ఎస్పీ రూపేశ్

నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలంలోని పోలీస్ అవుట్ పోస్టును సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు పోలీసులు ఉండడానికి మంచి సదుపాయాలు కల్పించడానికి నిర్మిస్తున్న బిల్డింగ్ బ్లాక్ ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం నారాయణఖేడ్ లోని డీఎస్పీ ఆఫీసులో పోలీసులతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు. పాత నేరస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. తరచూ వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ సంజీవరావు, వివిధ మండలాల ఎస్సైలు పాల్గొన్నారు.