
సంగారెడ్డి టౌన్, వెలుగు: పోలీస్‌శాఖ గౌరవం పెరిగేలా సిబ్బంది పనిచేయాలని ఎస్పీ రూపేశ్సూచించారు. గురువారం ఆయన సంగారెడ్డి, జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన దర్బార్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పోలీసులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరికి కంప్యూటర్‌పై అవగాహన ఉండాలన్నారు.
పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించకుండా విధులు నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా పెండింగ్‌లో ఉన్న పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ అశోక్, అధికారులు రఘు, రమేశ్ కుమార్, వెంకటేశం, అశోక్ , విజయ్ కృష్ణ పాల్గొన్నారు.