ఇచ్చోడ, వెలుగు: గ్రామాల్లోని రైతులకు చిరువ్యాపారులు మాయమాటలు చెప్పి బిటీ 3 పత్తి విత్తనాలను అంటగడుతున్నారని, వారిని అరికట్టాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. బీటీ 3 పత్తి విత్తనాలను గుజరాత్, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న వ్యాపారులు జిల్లాలోని గ్రామాల రైతులకు అమ్ముతున్నారని పేర్కొన్నారు.
ఈ విత్తనాలను నాటి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, నకిలీ విత్తనాలను అమ్మే డీలర్లపై కఠిన చర్యలు తీసుకొని, వారి ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.