
బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని గమనించిన గ్యాంగ్‌మెన్ ..రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఈ సమయంలో ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగుళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ ను అధికారులు నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. మరమ్మతులు చేపట్టారు.
పట్టా మరమ్మతుల కారణంగా ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. విరిగిన రైలు పట్టాకు రైల్వే అధికారులు మరమ్మతులు చేసిన తర్వాత ..సంఘమిత్ర ఎక్ర్‌ప్రెస్ రైలు బెంగుళూరు బయలుదేరి వెళ్లనుంది.