ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ (IFFCO) చైర్మన్ గా దీలిప్ సింఘాని వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మెన్‌గా బల్వీర్ సింగ్ కూడా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఇటీవ ల జరిగిన IFFCO ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 36 వేల రైతు సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగాయని ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ యూ ఎస్ అవస్థి అన్నారు.
మే 9, 2024న న్యూఢిల్లీలోనిIFFCO సదన్ లో IFFCO తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కోసం 15వ RGB ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో 36,000 కంటే ఎక్కువ సహకార సంఘాల సభ్యులను పాల్గొ న్నా రు. మొత్తం 21 మంది డైరెక్టర్ల పదవికి ఈ ఎన్నికలు జరిగాయి. మార్చి నెలలో ప్రారంభించిన భారీ కసరత్తులో దిలీప్ సంఘాని ఇఫ్కో ఛైర్మన్‌గా, బల్వీర్ సింగ్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
దిలీప్ సంఘాని..నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. వైస్-ఛైర్మెన్‌గా బల్వీర్ సింగ్ వరుసగా రెండోసారి తిరిగి ఎన్నికైన సింగ్.. త్తరప్రదేశ్‌లోని అధి కార బిజెపికి సీనియర్ సభ్యుడు, గతంలో బిజెపి సహకార సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా , షాజహాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
కాగా IFFCO.. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంస్థ.36,000 పైగా సహకార సంఘాలు ఉన్న IFFCO.. జనరల్ బాడీతో కూడిన RGB సభ్యులను ఎన్నుకునే ప్రక్రియను మార్చిలో ప్రారంభించి రెండు నెల ల పాటు కొనసాగించింది. అయితే ఈ సారి ఎన్నికల ప్రక్రియను కొత్త పద్దతిలో నిర్వహించింది. ఫారం సమర్పరణ, నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను సాగించింది.