పిట్లం, వెలుగు: కాటేపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ విజేతగా సంగోజీపేట జట్టు నిలిచింది. పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లిలో 12 రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ ఫైనల్ సోమవారం కాటేపల్లి, సంగోజీపేట మధ్య నిర్వహించారు. ఈ పోటీల్లో కాటేపల్లిపై సంగోజీ పేట జట్టు గెలుపొందింది. గెలుపొందిన జట్టుకు నిర్వాహాకులు రూ. 22,222 నగదు బహుమతి, మెడల్స్ అందజే శారు.
రెండో స్థానంలో నిలిచిన కాటేపల్లి జట్టుకు రూ. 11, 111 నగదు బహుమతి అందించారు. టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా బర్దావల్ కిషన్ ఎంపికయ్యారు. అతనికి మొమెంటో అందించారు. టోర్ని జరిగిన 12 రోజులుగా ఆటగాళ్లకు గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్, పానుగంటి బస్వరాజ్ స్నాక్స్, మినరల్ వాటర్ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.