సానియా మీర్జాకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్న తర్వాత షోయాబ్ మాలిక్ పై విమర్శలు మొదలయ్యాయి. మూడు పెళ్లిళ్లు చేసుకోవడంపై ఈ మాజీ పాక్ క్రికెటర్ పై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ మండిపడ్డారు. దీనికి తోడు తాజాగా నిన్న ఓ పాక్ మీడియా కథనం మాలిక్ కు పలువురు మోడళ్లు, సెలెబ్రిటీలతో సంబంధాలు కొనసాగిస్తుండగానే సనాతో అతనికి పరిచయం ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు. దీంతో మాలిక్ కు సొంత దేశం పాకిస్థాన్ లో సైతం విమర్శల వర్షం కురుస్తుంది.
మరోవైపు సానియాకు మాత్రం పాక్ దేశంలో భారీ మద్దతు లభిస్తుంది. మోడల్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు మాజీ భర్త షోయబ్ మాలిక్ వెల్లడించిన తర్వాత పాకిస్థాన్‌లో ప్రజల నుండి బలమైన మద్దతు లభిస్తుంది. సోషల్ మీడియాలో ప్రజలు మాలిక్, సనాలను దూషిస్తూ.. విడాకులు తీసుకోవాలనే సానియా నిర్ణయాన్ని సమర్థించారు. మాలిక్ నుంచి దూరం కావడం మంచిదే అని తమ సపోర్ట్ తెలియజేసారు.
ఇదిలా ఉండగా.. సానియా మీర్జాను కాదనుకున్న మరో పెళ్లి చేసుకున్న మాలిక్ పై తాజాగా ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి రానున్న కాలంలో మరిన్ని పెళ్లిళ్లు అవుతాయని.. సనా జావేద్‌తో అతని బంధం కొన్నాళ్లేనని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
మొదట అయేషా సిద్దిఖీని రహస్యంగా వివాహమాడిన షోయబ్.. 2010లో ఆమెకు విడాకులిచ్చిన వెంటనే సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆమెకు గుడ్ బై చెప్పి.. పాకిస్తానీ నటి సనా జావేద్ ను మనువాడాడు.
Indian tennis superstar #SaniaMirza has received strong support from people in #Pakistan after ex-husband #ShoaibMalik revealed last week that he has now married TV actor and model #SanaJavedhttps://t.co/9BT5YkrMw6
— Telangana Today (@TelanganaToday) January 26, 2024