టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ ఐదవ పుట్టినరోజును నిన్న(అక్టోబర్ 30) దుబాయ్‌లో గ్రాండ్ గా జరిపారు. 2010 లో వివాహం చేసుకున్న వీరు 2018 లో ఇజాన్ మీర్జాకు జన్మనిచ్చారు. జాన్ పుట్టినరోజు వేడుకలో కేక్ కటింగ్ వేడుకలో ఆమె తన కుమారుడితో కలిసి ఫోజులిస్తూ కనబడ్డారు. ఈ ఫోటోల్లో సానియా సోదరి అనమ్ మీర్జా కుమార్తె దువా కూడా ఉంది.
ఇజాన్ మీర్జా ఆకుపచ్చ ప్యాంటు, ప్రింటెడ్ టీ-షర్టు ధరించాడు. మాలిక్ టోపీ పెట్టుకొని సన్ గ్లాసెస్‌తో హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇక ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ తో పాటు ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేసింది. "ప్రతి బలమైన, స్వతంత్ర మహిళ వెనుక ఇతరులపై ఆధారపడకుండా ఒంటరిగా నిలబడటం నేర్చుకోవలసిన ఒక చిన్న అమ్మాయి నిలుస్తుంది" అని ఈ పోస్ట్ లో ఉంది. ఇక వీరిద్దరూ విడిపోయారనే పుకార్లు గతంలో చాలా చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి క్రిప్టిక్ పోస్ట్ ల ద్వారా సానియా సమాధానం చెప్పుకొచ్చింది. టెన్నిస్‌లో ఎంతో పేరుగాంచిన సానియా.. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తుంది.
#shoibhMalik with his son & Wife #SaniaMirza on his son's birthday❣️❣️
— Abhishek Singhal (@abhitweets20) October 29, 2023
Beautiful Pics.
Keep Retweeting.#INDvsENG #PakistanCricket #ENGvsIND #ICCWorldCup #RohitSharma? #ShreyasIyer pic.twitter.com/pB08qc5KB9
Also Read :- బంగ్లా బ్యాటర్లు విఫలం.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?