మీ నాన్నకు మూడు పెళ్లిళ్లు.. స్కూల్‌లో సానియా కొడుక్కి వేధింపులు!

మీ నాన్నకు మూడు పెళ్లిళ్లు.. స్కూల్‌లో సానియా కొడుక్కి వేధింపులు!

"ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది" అన్నట్టు తండ్రి పెళ్లి కొడుకు చావుకొచ్చింది ఇక్కడ.. సనా జావేద్‌ను పెళ్లి చేసుకొని షోయబ్ మాలిక్ భార్యతో సుఖవంతమైన జీవితం గడుపుతుంటే.. అతని కుమారుడు మాత్రం వేధింపులకు గురవుతున్నాడు. తండ్రి పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తూ స్కూల్‌లో తోటి విద్యార్థులు అతన్ని పట్టిస్తున్నారట. మీ నాన్నకు మూడో పెళ్లి ఆయనే.. అంటూ పాటలు పడుతూ అతన్ని బాధపెతున్నారట. ఈ కథనాలు ప్రచారం చేస్తుంది మరెవరో కాదు.. పాకిస్తాన్ మీడియా. భారత దేశంలో ఆ పిల్లాడి గురించి ఏ వార్త బయటకు రావడం లేదు. అలాంటిది పాక్ మీడియా అతను పడుతున్న బాధలపై పెద్ద పెద్ద కథనాలు ప్రసారం చేస్తోంది.

ఇటీవల షోయబ్ మాలిక్.. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చిన అతను ముచ్చటగా మూడోసారి మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. పైగా ఇది గొప్ప కార్యమన్నట్లు.. 'నాకు మూడో పెళ్లయ్యింది, ఆశీర్వదించండి..' అంటూ సోషల్ మీడియా వేదికగా అతనే ఈ విషయాన్ని వెల్లడించాడు. మాలిక్ ఈ పెళ్లిళ్ల వ్యవహారం అతని కుమారుడు ఇజాన్‌కు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది. అతను పాఠశాలలో వేధింపులను ఎదుర్కొంటున్నాడట. తోటి పిల్లలు అతన్ని వాళ్ళ నాన్న ప్రస్తావన తీసుకొస్తూ హేళన చేస్తున్నారట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

నయీమ్ హనీఫ్ అనే పాకిస్థానీ జర్నలిస్ట్.. తన కుమారుడి మానసిక ఆరోగ్యంపై సానియా ఆందోళన వ్యక్తం చేసినట్లు, ఇజాన్ ను తన తండ్రి మూడో పెళ్లి వార్తలు మానసిక క్షోభకు గురిచేశాయని ఆమె చెప్పినట్లు రాసుకొచ్చాడు. ఈ విషయం సానియా- షోయబ్ బంధాన్ని మరోసారి తెరమీదకు తెస్తోంది. ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఆ పిల్లాడి కోసమైనా ఇద్దరూ కలిసిపోవాలని వారికి సూచిస్తున్నారు. ఇప్పటికే పెళ్లి చేసుకొని.. కాపురం మొదలెట్టిన షోయబ్ మళ్ళీ సానియాతో కలవడం ఏంటండీ.. వీరిది వెర్రి సలహా కాకపోతే. కావాలంటే కొన్నాళ్ళు ఆగితే నాలుగోసారి పెళ్లి కుమారుడైన షోయబ్ మాలిక్ అని వార్తలు వస్తాయి. ఏదేమైనా పిల్లాడిని బాధపెట్టడం అనేది సరైనది కాదనేది మా, మీ అభిప్రాయం. మీరేమంటారూ..!