షోయబ్ మాలిక్‌తో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి సానియా మీర్జా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. రెండ్రోజుల క్రితం తండ్రి(షోయబ్) పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తూ స్కూల్‌లో సానియా కుమారుడిని తోటి విద్యార్థులు ఆట పట్టిస్తున్నారంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఇవి మరవక ముందే మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సానియా - షోయబ్‌ల మధ్య బంధం దృడంగా ఉన్నప్పటి ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో భారత టెన్నిస్ స్టార్ కొత్తగా పెళ్లైన మగువలకు ఎంతో విలువైన సలహాలిస్తోంది.
2023లో మెటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా మీర్జా అక్కడ కొత్తగా పెళ్లయిన అమ్మాయిల కోసం కొన్ని విలువైన సలహాలను పంచుకుంది. అంకితా సహిగల్ అనే కంటెంట్ క్రియేటర్ ఆమె ఇచ్చే సలహా గురించి అడిగినప్పుడు, సానియా ఇలా సమాధానమిచ్చింది. “జైసీ హో వైసీ రహో.. " మీరు మీలాగే ఉండండి, మారడానికి ప్రయత్నించకండి.. ఎందుకంటే మీరు మీవల్లనే ప్రేమించబడ్డారు.." అంటూ భర్తకు లొంగిపోవద్దని అర్థమొచ్చేలా సలహాలిచ్చింది.
నెటిజెన్స్ ఈ వీడియోను నెట్టింట రీట్వీట్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. సానియా చెప్పనట్టు వినండి.. పదేళ్ల తరువాత మీరు విడాకులకు సిద్ధంగా ఉండండి.. అంటూ తోచిన కామెంట్లు పెడుతున్నారు.