టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్‌కిన్ తయారీ యూనిట్లు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు పంట నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోహెడ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల. మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. బుగ్గపాడు మెగా టెక్స్ టైల్ పార్కులో వచ్చేనెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.