- కలెక్టరేట్ లో అధ్వానంగా శానిటేషన్
సూర్యాపేట, వెలుగు : కలెక్టరేట్ లో శానిటేషన్ అధ్వానంగా తయారైంది. ఒకవైపు బాత్ రూమ్స్‌లో బీర్ సీసాలు బయటపడుతుండగా, మరోవైపు అధికారులు, సిబ్బంది ఆఫీస్ బాల్కనీ నుంచి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు.
దీంతో కలెక్టరేట్ కు వచ్చే వారిపై నీళ్లు పడుతున్నాయి. బాల్కనీలో నీళ్లు పోస్తుండడంతో ఆ ప్రాంతం చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.