
జనగామ అర్బన్, వెలుగు : భారీ వర్షాలు పడుతున్నందున ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్‌సింగ్‌తో కలిసి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలను గుర్తించి ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈవీఎం సెంటర్ తనిఖీ
జనగామ ఆర్డీవో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అవగాహన, ప్రదర్శన సెంటర్‌ను శుక్రవారం కలెక్టర్ శివలింగయ్య సందర్శించారు. ప్రతి ఒక్కరూ ఈవీఎంల పనితీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దార్ రవీందర్, డీఏవో అండాలు ఉన్నారు.