అచ్చంపేట, వెలుగు : పెండింగ్ వేతనాలు చెల్లిస్తేనే డ్యూటీ చేస్తామని గవర్నమెంట్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు,సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆదివారం ఆందోళనకు దిగారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.16 వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా, రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.
తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ నిర్వాహకుడు కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వేతనాలు త్వరలో వేతనాలు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీఐటీయూ నాయకుడు మల్లేశ్, తదితరులు కార్మికులకు సంఘీభావం తెలిపారు. జయమ్మ, శ్రీదేవి, బాలింగమ్మ, రేణుక, బాలమనమ్మ, చంద్రకళ, లలిత, చిట్టెమ్మ పాల్గొన్నారు.