పారిశుద్ద్య కార్మికుడిపై ఏఎన్ఎం నాయకురాలి దాడి.. కేసు నమోదు

విధులకు ఆటంకం కలిగించిన ఏఎన్ఎం సంఘ నాయకురాలిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పారిశుద్ద్య కార్మికులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా  కోరుట్ల పట్టణంలో డిసెంబర్ 6వ తేదీ బుధవారం.. పారిశుద్ద్య కార్మికునిపై ఏఎన్ఎం సంఘ నాయకురాలు మధురిమ చేయి చేసుకున్నారు. తన ఇంటి వద్ద చెత్తను తీసుకుపోవడం లేదని కోపంతో మధురిమ.. మున్సిపల్ కార్మికునిపై చేయి చేసుకోవడాన్ని ఖండిస్తూ మున్సిపల్ కార్మికలు ఆందోళనకు చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో ధర్నా  మున్సిపల్ కార్మికులు చేశారు. వారికి వామపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.ఏఎన్ఎం సంఘ నాయకురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు..విచారించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత కార్మికుల ఆందోళన విరమించారు.