భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రస్తుత తరానికి చెందిన తన వరల్డ్ టెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఏడుగురు భారత క్రికెటర్లు ఉండడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ అతని టెస్ట్ జట్టులో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్టు నుంచి ఒకొక్కరిని ఎంపిక చేశాడు. విరాట్ కోహ్లీని తన జట్టుకు కెప్టెన్ గా ప్రకటించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా రిషబ్ పంత్ ను ఎంచుకున్నాడు.
ఓపెనర్లుగా రోహిత్, వార్నర్ తన జట్టులో చేర్చాడు. మూడో స్థానంలో విలియంసన్ ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మూడు, నాలుగు స్థానాల్లో వస్తారు. ఆల్ రౌండర్లుగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో పాటు.. రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో షమీ, బుమ్రా, అశ్విన్, హేజల్ వుడ్ కు అవకాశం దక్కింది. అయితే సంజయ్ బంగర్ ఈ జట్టులో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. ఇంగ్లాండ్ ఆల్ టైం బ్యాటర్లలో ఒకడైన రూట్ కు స్థానం దక్కపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రస్తుత తరంలో వీరు టెస్ట్ క్రికెట్ లో తమదైన ముద్ర వేశారు.
ఈ తరానికి చెందిన సంజయ్ బంగర్ వరల్డ్ టెస్ట్ XI:
రోహిత్ శర్మ,డేవిడ్ వార్నర్,కేన్ విలియమ్సన్,విరాట్ కోహ్లీ,రిషబ్ పంత్,బెన్ స్టోక్స్,రవీంద్ర జడేజా,రవిచంద్రన్ అశ్విన్,జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ షమీ,జోష్ హాజిల్‌వుడ్