వాళ్లు వ్యభిచారులైతే.. మిమ్మల్నేం అనాలె?..కేటీఆర్ కామెంట్లకు బండి సంజయ్ కౌంటర్ 

వాళ్లు వ్యభిచారులైతే.. మిమ్మల్నేం అనాలె?..కేటీఆర్ కామెంట్లకు బండి సంజయ్ కౌంటర్ 

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారినోళ్లు రాజకీయ వ్యభిచారులైతే.. వేరే పార్టీలో గెలిచిన వాళ్లను చేర్చుకుని పార్టీ నడుపుతున్న మిమ్మల్ని ఏమనాలని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘మీ అయ్య మొదట ఏ పార్టీలో ఉన్నడు? ఇప్పుడు ఏ పార్టీ నడుపుతున్నడు?’’ అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్​ చేసిన కామెంట్లకు సంజయ్ కౌంటర్​ఇచ్చారు. శుక్రవారం ఆయన ఇందిరాపార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. రెండ్రోజుల్లో బాంబులు పేలుతాయని మంత్రులంటే.. అరెస్ట్ చేస్తే మీ అంతు చూస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మూసీపై బీజేపీ నిర్వహించిన ధర్నా సక్సెస్ ను చూసి ఓర్వలేక ఆ రెండు పార్టీలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరివీ డ్రామాలేనని ఆరోపించారు. రాజకీయ నేతలు పద్ధతిగా మాట్లాడాలని సూచించారు.

బీఆర్ఎస్ నేతల భాష, వ్యవహార శైలి చూస్తే అసహ్యమేస్తోందన్నారు. కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? ఫోన్ ట్యాపింగ్ చేయించారా? లేదా? అనే దానిపై కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా గుండెమీద చేయి వేసుకుని ప్రమాణం చేయాలని చెప్పినట్టు తెలిపారు. కేటీఆర్​లీగల్ నోటీసులకు భయపడేది లేదని, వాటికి సరైన రీతిలో సమాధానమిస్తామని సంజయ్​స్పష్టం చేశారు.