- మాజీ మేయర్ సంజయ్
నిజామాబాద్, వెలుగు : పేద కుటుంబాలు నగరంలోని ప్రైవేటు హాస్పిటల్స్‌లో 30 శాతం రాయితీ ట్రీట్మెంట్ పొందేలా హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు మాజీ మేయర్ సంజయ్ ధర్మపురి తెలిపారు. మొదటి విడత లక్ష మందికి ఇవ్వాలని లక్ష్యం లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
నియోజకవర్గంతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు ఈ కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నగరంలోని టాప్హోప్, ప్రుడెన్స్, శ్రీకృష్ణ న్యూరో, ఇండస్, మెడికవర్ హాస్పిటల్స్‌లో తాము ఇచ్చే కార్డులతో రాయితీ వైద్యం పొందొచ్చన్నారు. చాలా రోజుల నుంచి తన మదిలో ఉన్న ఈ ఆలోచనను అమలు చేయడం గర్వంగా ఉందన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆధార్‌కార్డులతో వచ్చి హెల్త్‌కార్డులు పొందాలన్నారు.
పసుపు బోర్డు ఎలక్షన్ స్టంట్..
లోక్‌సభ సాక్షిగా పసుపు బోర్డు వీలుకాదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కోసం పసుపు బోర్డు ప్రకటించిందని సంజయ్ ఆరోపించారు. ఇది కచ్చితంగా ఎలక్షన్ స్టంటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో కాంగ్రెస్ ఫైనాన్స్చేస్తుందనే బీజేపీ ఆరోపణలపై మండిపడ్డారు.