బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇటీవల సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ‘కేజీఎప్ 2’లో అధీర పాత్రతో మెప్పించిన ఆయన ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆయన ‘బిగ్ బుల్’ అనే పాత్రలో నటిస్తున్నారు. శనివారం సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ, తన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
సిగార్ కాలుస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు సంజయ్ దత్. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. గతంలో నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’లో కాసేపు అతిథి పాత్రలో కనిపించిన ఆయన, దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు తమిళంలో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’ చిత్రంలో ఆంటోని దాస్ అనే కీలకపాత్రను పోషిస్తున్నారు.
శనివారం ఇందులోని ఆయన క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇంటెన్స్ లుక్‌లో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌లా కనిపిస్తున్నారు సంజూ. వీడియోకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఆ పాత్రను మరింత ఎలివేట్ చేసింది. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది. కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న సంజయ్‌దత్... మరో రెండు పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో కనిపించబోతున్నారు.