ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన సంజయ్ దత్.. ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్స్‌తో, విలన్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తున్నాడు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘కేజీఎఫ్ 2’లో విలన్ అధీరాగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడే క్యాన్సర్ బారిన పడ్డాడు సంజూ. ట్రీట్‌మెంట్ కోసం ఫారిన్ కూడా వెళ్లొచ్చాడు. కానీ పట్టుదలతో వర్క్ ఫినిష్ చేశాడు. ఇప్పుడు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ‘అధీరా ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్. డబ్బింగ్ సెషన్స్ కంప్లీట్’ అంటూ ట్వీట్ చేశాడు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.