Gautam Gambhir: గంభీర్‌ను మీడియాకు దూరంగా ఉంచండి.. మాజీ క్రికెటర్ విమర్శలు

Gautam Gambhir: గంభీర్‌ను మీడియాకు దూరంగా ఉంచండి.. మాజీ క్రికెటర్ విమర్శలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ పై సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. ఆస్ట్రేలియా బయలుదేరే ముందు ముంబైలో ముగిసిన  విలేకరుల సమావేశంలో గంభీర్ మాటలు మంజ్రేకర్ కు అసంతృప్తి కలిగించాయి. మీడియాతో మాట్లాడేటప్పుడు గంభీర్ సరైన ప్రవర్తనతో మాట్లాడడని.. అతన్ని ప్రెస్‌ తో మాట్లాడకుండా ఉంచాలని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ ను కోరాడు. 

మంజ్రేకర్ సోషల్ సోషల్ మీడియాలో ఇలా స్పందించాడు.. "ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్‌ని చూశాను. బీసీసీఐ అతడిని అలాంటి విధులకు దూరంగా ఉంచితే మంచిది. అతన్ని మీడియాకు  కనబడకుండా తెర వెనకే ఉంచాలి. మీడియాతో మాట్లాడేటప్పుడు అతని ముక్కుసూటి తత్వం విమర్శలకు దారి తీస్తుంది. సరైన ప్రవర్తనతో అతడికి మాట్లాడడం చేత కాదు. రోహిత్, అగార్కర్ ప్రెస్ ముందు మాట్లాడడానికి అర్హులు". అని మంజ్రేకర్ తన ఎక్స్ లో తెలిపాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత హెడ్ కోచ్ గంభీర్ ల మధ్య చిన్నపాటి వార్ నడించింది. మొదటగా పాంటింగ్ మాట్లాడుతూ.. "కోహ్లీకి గత ఐదేళ్లలో రెండే సెంచరీలు చేశాడు. ఇది భారత్ కు ఆందోళన కలిగించే అంశం" అని అన్నాడు. దీనికి టీమిండియా హెడ్ కోచ్ ఘాటుగా స్పందించాడు. 

ALSO READ | WI vs ENG: బట్లర్ 115 మీటర్ల సిక్సర్.. కొడితే బంతి కూడా కనబడలేదు

సోమవారం (నవంబర్ 11) భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరే ముందుగా గంభీర్ పాంటింగ్ కు కౌంటర్ ఇచ్చాడు. విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌పై మండిపడ్డాడు. పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించుకోవాలని..భారత క్రికెట్‌కు పాంటింగ్‌కు సంబంధం ఏంటి అని విరుచుకుపడ్డాడు. ఈ విషయం గంభీర్ ను విమర్శలకు గురి చేస్తుందని.. దీనితో పాటు ఇటీవలే కివీస్ తో స్వదేశంలో 0-3 తేడాతో ఓటమి తర్వాత గంభీర్ ఒత్తిడిలో ఉన్నాడని మంజ్రేకర్ అన్నాడు.