మత్స్యకారులను పట్టించుకోని టీఆర్ఎస్: సంజయ్ నిశాంత్

మునుగోడు,వెలుగు: మత్స్యకారులను తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని యూపీ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిశాంత్ ఆరోపించారు. చేపపిల్లల పంపిణీ కోసం గతంలో ప్రభుత్వం సొసైటీలకు సబ్సిడీ ఇచ్చేదని, ఇప్పుడు కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో వాళ్లు సప్లై చేస్తున్న చేపపిల్లలు చనిపోతున్నాయని విమర్శించారు.

మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీసులో శనివారం సంజయ్ నిశాంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఏమీ చేయలేదని, మోడీ సర్కారు రూ.20 వేల‌‌ కోట్లు కేటాయించిందని చెప్పారు. 15 రోజుల క్రితమే కిసాన్ క్రెడిట్ లాగే ఫిషరీస్​ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టిందని, దీంతో మత్స్యకారులు రూ.1.60 లక్షలు అప్పు తీసుకోవచ్చన్నారు. మునుగోడు లో 30 వేల మంది మత్స్యకారులున్నారని, వీరంతా బీజేపీకే ఓటేయాలన్నారు. ఉప ఎన్నిక స్టీరింగ్​ కమిటీ చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు.