- సంజయ్ రౌత్ ప్రశ్న
ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై వారం గడుస్తున్నా, మహాయుతి కూటమి ఫుల్ మెజార్టీ సాధించినా సీఎంను ఎందుకు ఎంపిక చేయడంలేదని శివసేన (యూబీటీ) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, కూటమి నేతలు ఏం చేస్తున్నారని అన్నారు. మరోవైపు శివసేన నేత ఏక్ నాథ్ షిండేపై విమర్శలు చేశారు. శివసేన పేరుతో ఏక్ నాథ్ షిండే బాలాసాహెబ్ పేరును రాజకీయాలకు వాడుకుంటున్నారని, కానీ ఆయన పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతున్నాయని ఆరోపించారు.
ALSO READ | Hemant Soren Oath: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణం..హాజరైన ఇండియా కూటమి నేతలు
నీ నిర్ణయాలు జరగాల్సింది ఢిల్లీలో కాదని, ముంబైలోనని తెలిపారు. బాలాసాహెబ్ థాకరే ఎన్నడూ బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లలేదని, వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ లాంటి నేతలే ఆయనను కలిసేందుకు ముంబైకి వచ్చేవారని గుర్తుచేశారు.