యూపీలో గెలిచేది ఆయనే

ముంబై: ఉత్తర్ ప్రదేశ్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సోమవారం రెండో ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యూపీ ఎలక్షన్ ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలసి యూపీలో పర్యటిస్తానన్న రౌత్.. అక్కడ ఎస్పీ గెలుపు జెండా ఎగురవేస్తుందన్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. రౌత్ మరో ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆదిత్య ఠాక్రే సారథ్యంలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీకి శివసేన రెడీ అవుతోందని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తల కోసం:

యోగి ఎట్ల చెబితే అట్ల!

ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్

ఒక్క సీన్ కోసం రూ. 60 కోట్లు ఖర్చు