ఈ సైకిల్‍ సవారీనే సంజయ్ ను పట్టించింది

రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ ‘గొర్రెకుంట బావి’ మిస్టరీ వీడింది. తొమ్మిది మందిని హత్య చేసింది ఒక్కడేనని తేలింది. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక హత్య నుంచి తప్పించుకునేందుకు అంత మందిని చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు. కేసును త్వరగా సాల్వ్ చేసిన పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు. సంజయ్ ను పట్టుకోవడానికి కీలక ఆధారాలను తెలిపారు.

సైకిల్ సవారి..

సైకిల్‍ సవారీ సంజయ్‍ తెల్లగా ఉంటాడు. తన గ్లామర్‍కు అమ్మాయిలు ఈజీగా పడిపోతారనేది అతని నమ్మకం. ఎక్కడికైనా సైకిల్‍ మీదే వెళ్లేవాడు.
తానుండే జాన్ పాక నుంచి మర్డర్‍ జరిగిన ప్రాంతానికి రోజు సైకిల్‍ మీదే వచ్చి వెళ్లాడు. రెక్కీ నిర్వహించిన రోజులు, హత్యలు చేసినరోజు.. ఆ తెల్లారి కూడా ఇదే సైకిల్ పై రౌండ్ లు కొట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ సైకిల్‍ సవారీనే అతడిని పట్టించింది.

సీసీ కెమెరాల ఆధారంగా..
ఈ కేసుపై హోంమంత్రి, డీజీపీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వరంగల్ సీపీ దర్యాప్తు చేపట్టారు. లోకల్ పోలీసులు, టాస్క్​ఫోర్స్, సీసీఎస్, సైబర్ క్రైం,టెక్నికల్ టీం , హైదరాబాద్ నుంచి స్పెషల్ క్లూస్ టీం ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశాయి. సంజయ్ ఈ నెల 16 నుంచి 20 వరకు రోజూ సైకిల్ పై వెళ్లడం గోదాం , గొర్రెకుంట ఏరియాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. గురువారం ఉదయం 5
గంటల తర్వాత కూడా వెళ్లినట్లు కనిపించింది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సోమవారం మధ్యాహ్నం జాన్ పాకలోని
తన ఇంట్లో ఉన్న సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అన్ని హత్యలూ తాను ఒక్కడే చేసినట్లు చెప్పాడని తెలిపారు వరంగల్ సీపీ రవీందర్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది