బెల్లంపల్లి : నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ప్లేయర్ రాసకొండ సంజీవ్ సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా సంజీవ్‌ను సోమవారం రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అభినందించారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. జూలై 1 నుంచి 5వ తేదీ వరకు పంజాబ్ లోని జలంధర్‌లో జరిగిన వాకో ఇండియా జాతీయ సీనియర్స్, మాస్టర్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో పాల్గొని ప్రతిభ కనబర్చి ఈ పతకం
సాధించినట్లు తెలిపాడు.